Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా సైన్యంలో సంచలన రూల్‌.. 30 దాటితే టెస్టోస్టెరాన్‌ టెస్ట్‌ తప్పనిసరి!

US Army sensational rule Mandatory testosterone test for those over 30
Advertisement
  • 30 ఏళ్లు దాటిన సైనికులకు టెస్టోస్టెరాన్‌ స్క్రీనింగ్‌
  • డిఫెన్స్‌ హెల్త్‌ ఏజెన్సీ కొత్త మార్గదర్శకాలు జారీ
  • లోపం నిర్ధారణైతేనే చికిత్సకు అవకాశం
  • పనితీరు పెంపు కోసం టెస్టోస్టెరాన్‌ వాడకంపై నిషేధం
  • నిర్ధారణకు రెండు వేర్వేరు రక్త పరీక్షలు తప్పనిసరి
Advertisement
అమెరికా సైన్యంలో కీలక మార్పు చోటుచేసుకుంది. 30 ఏళ్లు దాటిన సైనికులకు టెస్టోస్టెరాన్‌ లోపం ఉందా? లేదా? అన్నది పరీక్షించేలా పెంటగాన్‌ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే టెస్టోస్టెరాన్‌ను శారీరక సామర్థ్యం పెంచుకునేందుకు వాడటాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.

డిఫెన్స్‌ హెల్త్‌ ఏజెన్సీ సెప్టెంబరు 17న ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. యాక్టివ్‌ డ్యూటీతో పాటు రిజర్వ్‌ సైనికులకు వర్తించేలా సాధారణ పరీక్షలు, చికిత్స విధానాలను ఇందులో నిర్దేశించింది. 30 ఏళ్లలోపు సైనికులు మాత్రం తమకు పరీక్ష కావాలంటే కోరవచ్చు.

సైనికుల యుద్ధ సన్నద్ధతను పెంచడమే ఈ చర్య వెనక అసలు లక్ష్యమని పెంటగాన్‌ తెలిపింది. ‘‘ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండే శక్తిమంతమైన సైనిక బలగాన్ని నిర్మించడంపై దృష్టి కొనసాగుతోంది’’ అని పెంటగాన్‌ ప్రధాన ప్రతినిధి తెలిపారు.

అయితే టెస్టోస్టెరాన్‌ లోపానికి చికిత్స చేయడం, యుద్ధ సామర్థ్యాన్ని పెంచేందుకు హార్మోన్‌ వాడటం రెండూ వేర్వేరు అంశాలని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం పనితీరు పెంపు కోసం టెస్టోస్టెరాన్‌ వాడటానికి తగిన శాస్త్రీయ మద్దతు లేదని పేర్కొంది.

ముందుగా సైనికుల్లో లక్షణాలు, ప్రమాద కారకాలను పరిశీలిస్తారు. అనుమానం ఉంటే రక్త పరీక్ష చేస్తారు. టెస్టోస్టెరాన్‌ తక్కువగా ఉందని ఒక్కసారి పరీక్షలో తేలడం లేదా కొన్ని లక్షణాలు ఉండటం మాత్రమే లోపం నిర్ధారణకు సరిపోదు. వేర్వేరు రోజుల్లో ఉదయం పూట, ఖాళీ కడుపుతో రెండుసార్లు రక్త పరీక్ష చేయాలి.

లైంగిక ఆసక్తి తగ్గడం, శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, కండరాల పరిమాణం తగ్గడం, నిరాశ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తగినంత ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యల వల్ల కూడా ఇవే లక్షణాలు రావచ్చని మార్గదర్శకాలు హెచ్చరించాయి.

2018 నుంచి 2025 వరకు సైనిక ఆరోగ్య రికార్డుల ప్రకారం.. ప్రతి ఏడాది టెస్టోస్టెరాన్‌ లోపానికి క్లినికల్‌ డయాగ్నసిస్‌ పొందిన పురుష సైనికులు ఒక శాతం కంటే తక్కువేనని పత్రం తెలిపింది.

టెస్టోస్టెరాన్‌ చికిత్స వల్ల లైంగిక పనితీరు, శరీర నిర్మాణం, ఎముకల సాంద్రతలో ప్రయోజనాలు ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అయితే శక్తి, శారీరక సామర్థ్యం, చురుకుదనం, జ్ఞాపకశక్తి పెంచేందుకు దీన్ని ఉపయోగించడంపై ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

చికిత్స తీసుకోవాలా? వద్దా? అనేది సైనికుల వ్యక్తిగత నిర్ణయమేనని కూడా పెంటగాన్‌ స్పష్టం చేసింది. పరీక్షలు లేదా చికిత్సను తిరస్కరించినందుకు సైనికులపై ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని తెలిపింది.
Advertisement
Advertisement
US Army
Pentagon
Testosterone testing
Defense Health Agency
Soldier combat readiness
Military health guidelines

More Telugu News